సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో బీజేపీ తన 10 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్ ను ఆ పార్టీ నేడు, బుధవారం సాయంత్రం విడుదల చేసింది. తాజా లిస్టులో కీలకమైన ధర్మవరం సీటుకు బీజేపీ అభ్యర్థిని ప్రకటించడంతో ఇప్పుడు టీడీపీ నుంచి టికెట్ ఆశించిన పరిటాల శ్రీరామ్ , మరియు ఎచ్చెర్ల లో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ మంత్రి కళా వెంకట్రావు పరిస్థితి .. అలాగే విజయవాడ పశ్చిమ సిటు లో జనసేన నేత పోతిన మహేష్ తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉండనున్నాయో? ఆ పార్టీ నేతలలో టెంక్షన్ నెలకొంది . ఇక బీజేపీ అధికారిక అభ్యర్థుల లిస్ట్.. 1. ఎచ్చెర్ల-ఈశ్వర రావు 2. విశాఖ నార్త్-విష్ణు కుమార్ రాజు 3.అరకు-రాజారావు 4.అనపర్తి-శివ కృష్ణంరాజు 5.విజయవాడ వెస్ట్-సుజనా చౌదరి 6.బద్వేల్-బొజ్జ రోషన్న 7.జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి 8.ఆదోని-పీవీ.పార్ధసారధి 9.ధర్మవరం-వై.సత్య కుమార్ 10.కైకలూరు-కామినేని శ్రీనివాసరావు. తాజా ట్విస్ట్ ఏమిటంటే.. బీజేపీ తనకు అదనంగా 11 స్థానాన్ని కావాలని టీడీపీ ని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం..మరి ఆ త్యాగరాజు ఎవరో?
