సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చాల కాలం తరువాత ఏపీలో మావోయిస్టుల ఎన్కౌంటర్ జరిగింది. నేడు, మంగళవారం ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా, మారేడుమిల్లి అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మా మృతి చెందాడు. హిడ్మాతో పాటు మొత్తం ఆరుగురు ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. ఈ విషయాన్ని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు.ఇదే సమయంలో విజయవాడలో కొత్త ఆటోనగర్‌లో 12 మంది మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బృందాల ఆధ్వర్యంలో సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. మావోయిస్టులు ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టారు. 12 మంది మావోయిస్టుల్లో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మిగిలిన 6 గురు మావోయిస్టుల కోసం భారీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే దీనిపై అధికారికంగా వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *