సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు.. సినీ హీరోగా వెనుకబడినప్పటికీ తెలుగు సినీ నటుల మా ‘ అధ్యక్షుడి’గా సంచలన రీతిలో ఎన్నికయి సినీరంగంలో సంచలనం రేపారు. ఆయన తాజగా మీడియాతో తాజా రాజకీయ పరిణామాలు ఫై సోషల్ మీడియా ఛానెల్ లో మాట్లాడుతూ.. ప్రస్తుతం ‘భక్త కన్నప్ప’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నానని, ఆ సినిమా 150 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నామని అన్నారు. ఎన్నికలలో చంద్రగిరి నుండి పోటీ చేసే ఉద్దేశ్యం లేదని అంటు.. పవన్ కళ్యాణ్ రాజకీయాలలో రాణిస్తారా? అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా . ‘పవన్ సినిమాల గురించి అయితే చెప్ప గలుగుతాను. నేనేం బ్రహ్మం గారిని కాదుకదా? సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఆయన సూపర్ స్టార్. సందేహమే లేదు. కానీ పవన్ రాజకీయాల గురించి మాత్రం చెప్పలేను.’ ప్రజలు చాలా తెలివిగా ఆలోచిస్తారు, హీరోల సినిమా వస్తే బాగా చూస్తారు. కానీ వారికీ ఓటేయాలనుకున్నప్పుడు వాళ్లకు నచ్చి న వ్య క్తికే ఓటేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.. రాజకీయాల ద్వారా ఎవరైతే తన గ్రామాన్ని , తన దేశాన్ని , తన జీవితాన్ని బాగుచేస్తారని నమ్మితే వారివైపే ప్రజలు ఉంటారని ఆయన తెలిపారు. మరో ఆరు నెలలు ఆగితే రాజకీయాల్లోపవన్ భవిష్యత్ఏమిటనేది చెబుతానని విష్ణు అన్నా రు. ఏపీలో సీఎం జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలు ప్రోగ్రాం చాలా బాగుంది. దాని వల్ల చాలా మంది పేద ప్రజలు లబ్ధిపొం దుతున్నా రు. దీనిని బట్టి చూస్తే ఏపీలో మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది జగన్ మోహన్ రెడ్డిగారే అని ఆయన పేర్కొ న్నా రు. ఇదే విషయాన్ని దేశంలో పేరుపొం దిన ఎన్ని కల సర్వే లన్నీ తెలుపుతున్నాయని మంచు విష్ణు ఉదహరించారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *