సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలోని ఎలాంటి ఉపాధికి నోచుకోని వారికి, ఒంటరి మహిళలకు సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి సర్కార్ శుభవార్త ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆర్థికంగా ఎదిగేలా నగరాలు, పట్టణాల్లో ఎగ్మార్ట్లు ఏర్పాటు చేసుకునేలా సాయం అందిస్తోంది. పట్టణ పేద మహిళల ఉపాధికి కొత్తగా ఎగ్మార్ట్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. జిల్లాకు పది చొప్పున మొత్తం 260 మార్ట్లు ఏర్పాటు చేయనున్నారు. నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (NECC) ఆధ్వర్యంలో ఒక్కో మార్ట్ ఏర్పాటుకు రూ.50వేలు చొప్పున నిధులు సమకూర్చనున్నారు. ఇందులో రూ.35వేలతో కార్ట్ (బండి), ఇతర సామాగ్రి అందిస్తారు. మరో రూ.15వేల విలువైన గుడ్లు సరఫరా చేస్తారు. గుడ్లతోపాటు వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ఆసక్తిఉన్న వారు ఈ ఎగ్మార్ట్ కోసం 15 అంశాలకు ఒకే చెబుతూ స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. గుడ్లతోపాటు వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయించొచ్చు. అయితే, ఎంపికైన వారికి ముందుగా శిక్షణ ఇస్తారు రూపాయి పెట్టుబడి లేకుండా . ఇది మహిళల ఉపాధికి అరుదైన అవకాశమని మెప్మా అధికారులు చెబుతున్నారు
