సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తమకు అందిన ఫిర్యాదుల మేరకు ఎన్నికల కమిషన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి షాక్ ఇచ్చింది. ఎన్నికల షెడ్యూలుకు రెండు నెలల ముందే వ్యూహాత్మకంగా అధికార నియమాలు లో చేర్పులు మార్పులు చేసారని అందిన పిర్యాదు మేరకు ఎన్నికల కమిషన్ ఒకే ఉత్తర్వుతో ముగ్గురు IAS, ఆరుగురు IPSలను పక్కకు తప్పించింది. వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ ఈ స్థాయిలో అధికారులపై చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారి. ఐదుగురు ఎస్పీ లు సహా ఆరుగురు I P Sలు, ముగ్గురు కలెక్టర్లను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి, అనంతపురం జిల్లా ఎస్పీ కె.కె.ఎన్. అన్బురాజన్, చిత్తూరు జిల్లా ఎస్పీ పల్లె జాషువా, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డి, గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజులను, కృష్ణా జిల్లా కలెక్టర్ పీ రాజబాబు, అనంతపురం కలెక్టర్ ఎం.గౌతమి, తిరుపతి కలెక్టర్ డా.లక్ష్మీషాను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీ విస్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అనంతపురం జిల్లా కలెక్టరు, ఎస్పీ ఇద్దరినీ ఒకేసారి బదిలీ చేయడం గమనార్హం. ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చిన కొన్ని గంటల్లోనే ఐదుగురు ఎస్పీలతోపాటు గుంటూరు రేంజ్ ఐజీని పోలీసు ప్రధాన కార్యాలయానికి బదిలీచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
