సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నిన్న ఆంధ్ర ప్రదేశ్ ఓట్లు వెయ్యడానికి జనం పోటెత్తటడం చరితాత్మక ఘటనగా దేశానికీ ఆదర్శంగా భావించవచ్చు , మొత్తానికి కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ముగిసింది. ఎన్నడూ లేనిది దేశ విదేశాల నుంచి వచ్చి మరీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2 గంటల వరకూ పోలింగ్ జరిగిందని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు. 2019 ఎన్నికల్లో 79.2 శాతం పోలింగ్ నమోదైందనితెలిపారు. 0.6 శాతం పోస్టల్ బ్యాలెట్‌తో కలిపి మొత్తం 79.8 శాతం నమోదు అయిందని తెలిపారు. ఈ ఎన్నికల్లో గత రాత్రి 12 గంటల వరకూ 78.25 నమోదైనట్లు అంచనా వేశారు. 1.2 శాతం పోస్టల్ బ్యాలెట్‌తో 79.4 శాతం నమోదైందన్నారు. నేటి మంగళవారం సాయంత్రానికి పూర్తి వివరాలు వస్తాయని తెలిపారు. మా అంచనా ప్రకారం పోస్టల్ బ్యాలెట్ కలిపి 81+ శాతం పోలింగ్ నమోదు కావచ్చని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.
