సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు మంగళవారం ఏపీలో రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము పర్యటిస్తున్నారు. మంగళగిరి ఎయిమ్స్‌లో నిర్వహించనున్న స్నాతకోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిధిగా విచ్చేసి డాక్టర్స్ ను విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. . ఈ నేపథ్యంలో నేటి మధ్యాహ్నం విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టుకు విచ్చేసిన రాష్ట్రపతికి కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు ఐపిఎస్ మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చం అందజేసి సాదర స్వాగతం పలికారు.
