సిగ్మాతెలుగు డాట్, ఇన్, న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో రేపు, సోమవారం నుంచి ప్రభుత్వ, ప్రెవేటు స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి. అయితే ఎండల తీవ్రత వడగాల్పులు, ఉష్ణోగ్రతల తీవ్రత దృష్ట్యా ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. ఈ నెల 17వ తేదీ వరకు ఒంటిపూట బడులు ఉంటాయని, ఉదయం 7.30 నుంచి 11.30 గంటల వరకు స్కూళ్లు నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు ఈ నిబంధన వర్తించనుంది. జూన్ 19 నుంచి విద్యా ప్రణాళిక షెడ్యూల్ ప్రకారం బడులు పూర్తిస్థాయిలో నడుస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *