సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో రేపు (23వ తేదీ ఆదివారం ) నిర్వహించాల్సిన గ్రూప్స్ 2 మెయిన్ పరీక్షను కొద్ది రోజుల పాటు వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ సెక్రటరీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. రోస్టర్ తప్పులను సరిచేయకుండా పరీక్ష నిర్వహణపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రోస్టర్ అంశంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. వచ్చే మార్చినెల 11వ తేదీన మరోమారు ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపడుతున్న నేపథ్యంలో అప్పటి వరకు పరీక్షలు నిర్వహించవద్దని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ బోర్డు ను ఆదేశించింది… అయితే నేటి సాయంత్రం వరకు బోర్డు అధికారిక ప్రకటన రాలేదు.రేపు(ఫిబ్రవరి 23)న జరగనున్న ఏపీపీఎస్సీ గ్రూపు-2 మెయిన్ పరీక్షకు 175 కేంద్రాల్లో ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. మెయిన్స్ పరీక్షకు 92,250 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంది. ప్రభుత్వ లేఖపై ఇంతవరకు ఏపీపీఎస్సీ స్పందించకపోవడంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *