సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో సంక్రాంతి సెలవులు కుదిస్తున్నారని వస్తున్నా వార్తలను ప్రభుత్వం ఖండించింది. జనవరి 11–15 లేదా జనవరి 12–16 వరకు సెలవులు కుదిరిస్తున్నారన్న ప్రచారంలో నిజం లేదని తెలిపింది. ఆంధ్రాలో సంక్రాంతి పండుగ ఎంత గొప్పగా చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సంక్రాంతి వస్తే.. హైదరాబాద్లో సగం సిటీ ఖాళీ అవుతుంది. సెటిలర్స్, జాబ్స్ నిమిత్తం నగరంలో ఉండేవారు అంతా సొంత ఊర్లకు వెళ్లిపోతారు. పిండి వంటలు, కోళ్ల పందేలు, భోగి మంటలు, భావ మరదళ్ల సరదా ఆటలు.. ఆహా.. ఆంధ్రాలో ఈ పండుగ తీరే వేరు. తాజాగా ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు.. పండుగ హాలిడేస్ ఇస్తున్నట్లు.. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు.2024-25 అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే సెలవులు ఉంటాయన్నారు.
