సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో విద్యుత్ ఉద్యోగులు ఈ నెల 15వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేయబోతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో తమ సమస్యలపై విద్యుత్ ఉద్యోగులు పలు సార్లు ప్రభుత్వ దృష్టికి తెచ్చినప్పటికీ పరిష్కరం కాలేదని, విద్యుత్ సంస్థల యాజమాన్యంతో జరిగిన చర్చలు కూడా విఫలం కావడంతో తప్పని పరిస్థితులలో ఈ నెల 15వ తేదీ నుంచి నిరవధిక సమ్మె సిద్ధం అవుతున్నట్లు విద్యుత్ ఉద్యోగుల స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ నాగలక్ష్మి, తెలిపారు. నిజానికి గత నెల 30న ఉద్యోగుల జేఏసీ 29 ముఖ్యమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమ్మె నోటీసు ఇచ్చింది. ఈ క్రమంలో గత బుధవారం విజయవాడలోని విద్యుత్ సౌధలో యాజమాన్యం ఆహ్వానం మేరకు జేఏసీ ప్రతినిధులు చర్చలు జరిపారు. అక్కడ డైరెక్టర్ల నుంచి సమస్యల పరిష్కారంపై సరైన హామీ లభించకపోవడంతో సమ్మె అనివార్యమైందని జేఏసీ ప్రకటించింది.
