సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కూటమి శ్రేణులు పీడ విరగడ అయ్యింది దినం జరుపుకొంటుంటే.. మరోప్రక్క దానికి ప్రతిగారాష్ట్ర వ్యాప్తంగా మాజీ సీఎం జగన్ ఇచ్చిన పిలుపు మేరకు వైసీపీ శ్రేణులు నేడు, బుధవారం ‘వెన్ను పోటు దినం’ కార్యక్రమాన్ని అన్ని జిల్లాలలో నిర్వహించారు. ఎమ్మెల్సీ బొత్య సత్యనారాయణ’ వడ దెబ్బకు మాట్లాడుతూనే కూలిపోవడం,తరువాత ఆసుపత్రి లో చికిత్స అనంతరం కోలుకొన్నారు. నగరిలో మాజీ మంత్రి రోజా చెవిలో పువ్వులు పెట్టుకొని , కేతి రెడ్డి ఆధ్వర్యంలో నీకు 15 వేలు నీకు 15వేలు..అంటూ నిమ్మల రామానాయుడు మాటలే నమ్మరు కదరా? ఆయనకు ఇవ్వడానికి పూతరేకులు కొన్నారా?ఎన్ని సారులు చంద్రబాబు మోసం చేసిన ఎలా నమ్ముతారురా?అంటూ ప్రజలను ప్రశ్నిస్తూ సెటైర్స్.. వేలాది కార్యకర్తలతో భారీ ర్యాలీలు, అంబటి రాంబాబు నిరసన ర్యాలీ ని అడ్డుకొన్న పోలీసు అధికారులతో నడిరోడ్డుపై తీవ్ర స్థాయిలో వాదనకు దిగటం..ర్యాలీకి అనుమతి లేదు నువ్వెవడివి వెనక్కి పో అని అధికారి అనడం.. ర్యాలీని అపి చూడు తెలుస్తుంది కబడ్ధార్ అని అంబటి హెచ్చరించడం.. మీడియాలో హైలైట్ గా నిలిచాయి.
