సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎండాకాలం వచ్చేసింది. ఉదయం 9 గంటల నుండే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఏపీ విపత్తుల నిర్వహణ,వాతావరణ శాఖ ప్రకటించిన తాజా సమాచారం ప్రకారం నేడు, శుక్రవారం మరియు రేపు శనివారం ఏపీలోని రెండు మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 84 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని హెచ్చరిక జారీ చేసింది. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభావం తక్కువ.. ఇక శ్రీకాకుళం జిల్లా 9 మండలాలలో , విజయనగరం 13, పార్వతీపురం మన్యం 11, అల్లూరి సీతారామరాజు 9, అనకాపల్లి 1, కాకినాడ 4, తూర్పుగోదావరి 8, పశ్చిమగోదావరి ఒక మండలంలో , ఏలూరు 8, కృష్ణా 7, గుంటూరు 8, బాపట్ల జిల్లాలోని 5 మండలాల్లో వడగాల్పులు ప్రభావం ఉంటుంది. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, సీతంపేట మండలాల్లో తీవ్ర స్థాయిలో వడగాల్పులు వీచే అవకాశముంది. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎండలో తిరగడం నివారించాలని, ఎండదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు
