సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చంద్రబాబు సర్కార్ ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాలకు సంబందించి తాజగా.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణ కోసం మండల, మున్సిపల్, జిల్లా స్థాయిల్లో అధికారులు రానున్నారు. ఈ నెల చివరి నాటికి తొలి దశలో మండల స్థాయి పర్యవేక్షకుల నియామకం త్వరలో జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 660 మంది డిప్యూటీ మండల పరిషత్ అధికారులను మండల స్థాయి పర్యవేక్షకులుగా నియమిస్తారు అని సమాచారం. వీరందరినీ డిప్యుటేషన్‌పై సచివాలయాల శాఖ వినియోగించుకోనుంది. ఇటీవల గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శులు, జడ్పీ, మండల కార్యాలయాల్లో పరిపాలన అధికారులకు డిప్యూటీ ఎంపీడీవోలుగా పదోన్నతులు కల్పించారు. ఈ పదోన్నతి పొందిన వారి జాబితా సచివాలయాల శాఖకు ఇప్పటికే చేరింది. వీరి సేవలను సచివాలయాల పర్యవేక్షణకు ఉపయోగించుకుంటారు. రెండో దశలో మున్సిపల్, జిల్లా స్థాయిల్లో అధికారులను కేటాయిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *