సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గుంటూరు జిల్లా ఇప్పటంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు, శనివారం పర్యటించి రోడ్ల విస్తరణ లో,ఆక్రమణల తొలగింపులో గోడలు కూల్చివేసిన కుటుంబాలను పరామర్శించారు. మీడియా తో మాట్లాడుతూ.. తనకు ఇక్కడి వారు పార్టీ బహిరంగ సభకు స్థలం ఏర్పాటు చేసినందుకు వైసిపి ప్రబుత్వం వారిపై కక్ష తో వారి ఆస్తులు ధ్వసం చేస్తుందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. వైసీపీ గూండాలను ధైర్యంగా ఎదుర్కోవాలని, అవసరమైతే ఇడుపుల పాయలో మనం నేషనల్ హై వే వేసి అక్కడ వారి ఆక్రమణలను తొలగిద్దామని పిలుపు నిచ్చారు. కాకినాడ రాజమండ్రి కాదు.. ఇప్పటం ఒక గ్రామం.. ఇక్కడ ముందు రోడ్లు బాగుచేయించలేరు కానీ రోడ్ల విస్తరణ చేస్తామని ఆస్తులు ధ్వసం చేస్తారా? ‘ఏపీలో సీఎం జగన్‌మోహన్ రెడ్డి కాదు… సజ్జల రామకృష్ణారెడ్డి అని అన్నారు. ‘‘సజ్జల గారూ… మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎదుర్కోవడానికి నేను సిద్ధం’’ అని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా పాలన సాగుతోందని పవన్ మండిపడ్డారు. ‘‘నాకు మద్దతు ఇస్తే ఇళ్లు పడగొడతారా. ఇక నుంచి మీ దౌర్జన్య కాండపై మా పోరాటం సాగుతుంది. చొక్కా పట్టుకుంటే… చెప్పు తీసుకుని కొట్టండి. ఇక నుంచి పద్ధతిగా రాజకీయం‌ చేస్తే… మేము అలాగే వెళతాం. బూతులు, దాడులు అని తెగ బడితే మాత్రం…తేల్చుకుంటాం’’ అంటూ తనదయిన శైలి లోపవన్ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *