సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగించాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ తాజగా నేడు, సోమవారం, సీఎం జగన్ కి లేఖ రాశారు. ఏపీలో కూడా గత 10 రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల సెలవులు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయని, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు రెండు వారాల పాటు స్కూల్స్‌కు సెలవులు ప్రకటించాయన్నారు.15 ఏళ్ల లోపు పిల్లలకు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదని, థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల ప్రాణాలతో చెలగాటమాడొద్దన్నారు నారా లోకేష్ ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *