సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో ఈ ఏప్రిల్ 2వ తేదీతో ముగుస్తున్న 10 వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఫై విద్యార్థులకు వారి తల్లి తండ్రులకు ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. మరి ఈ .. పరీక్షా పత్రాల ముల్యాంకన కు శరవేగంగా ఉపాధ్యాయులతో విద్య శాఖ ఏర్పట్లు చేస్తుంది. పరీక్ష ఫలితాలు ఎట్టి పరిస్థితులలో ఏప్రిల్ 4వ వారంలో విడుదల చేసేందుకు SSC బోర్డు చర్యలు చేపట్టింది. జవాబు పత్రాల మూల్యాంకనం 6-15 తేదీ వరకు జరుగుతుంది. అనంతరం OMR స్కానింగ్ ఉంటుంది. ఆన్సర్ షీట్లలో తేడాలుంటే వెరిఫికేషన్కు జిల్లాలను సంప్రదించడం, వాల్యుయేషన్ పత్రాల ర్యాండమ్ చెకప్ అనంతరం కంప్యూటరీకరణ చేస్తుంది. ఇవి పూర్తయ్యాక 30లోపు రిజల్ట్స్ ప్రకటిస్తామని బోర్డు అధికారులు పేర్కొంటున్నారు.ఇక ఇంటర్మీడియట్ ఫలితాలు కూడా ఏప్రిల్ 21 లోపు ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. మే మొదటి వారంలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నందున, ఏప్రిల్ మూడో వారంలోనే ఫలితాలు వెల్లడించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
