సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వె స్టర్స్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్బంగా సీఎం జగన్ సమక్షంలో వేదికపై రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. సమ్మి ట్లో నేను కూడా భాగమైనందుకు సంతోషంగా ఉంది. దేశంలో అతి పెద్ద సముద్ర తీర ప్రాంతాలు ఉన్న రాష్ట్రాలలో ఏపీ ది 2వ స్థానం .. పారిశ్రామికంగా పలు రంగాల్లోఏపీ వన్ గా మారుతున్నందుకు శుభాభినందనలు తెలుపుతున్నాను. ఏపీలో మా జియో నెట్ వర్క్ బాగా అభివృద్ధి చెందింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రగతికి ఏపీ సర్కార్ మంచి సహకారం అందిస్తోంది. ఏపీలో వనరులు పుష్కలంగా ఉన్నాయి. పలువురు అంతర్జాతీయ స్థాయి నిపుణులు ఏపీ నుంచే ఉన్నారు. సీఎం జగన్ సమర్థవంతమైన నాయకత్వంలో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఏపీలో రిలయన్స్ పలు రంగాలలో వేల కోట్ల పెట్టుబడులను పెట్టబోతోంది. ఏపీలో 10 గిగావాట్ల సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్టు అంబానీ తెలిపారు. ఇక ప్రఖ్యాత అదానీ పోర్ట్స్ సీఈవో కరణ్ అదానీ,ఒబెరాయ్ హోటల్స్ ఎగ్జిక్యూ టివ్ చైర్మన్ అర్జున్ బబెరాల్ తదితరులు మాట్లాడుతూ.. ఏపీలో పరిశ్రమ ల స్థాపనకు అధికారులు వేగంగా సహకారం అందిస్తున్నారని, ఇక పర్యాటక రంగం అంతర్జాతీయ స్థాయిలో ఉంది. ఏపీ పర్యా టక రంగంలో ప్రీమియర్ డెస్టినేషన్గా ఏపీ ఉందని ప్రశంసించారు.
