సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ముగిసిన ఆంధ్రప్రదేశ్ పదో తరగతి విద్యార్థులకు ఏపీ ఎస్ఎస్సీ బోర్డు నేడు, శనివారం శుభవార్త చెప్పింది. హిందీ, ఇంగ్లిష్ ప్రశ్నాపత్రంలో మొత్తం 3 ప్రశ్నల్లో అస్పష్టత కారణంగా ప్రశ్నల్లో పొరపాట్లు/ అస్పష్టత ఉన్నట్లు బోర్డు అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో వాటిని పూరించిన విద్యార్థులకు నష్టం జరగకుండా గ్రేస్ మార్కులు ఇవ్వాలని ఎస్ఎస్సీ బోర్డు నిర్ణయం తీసుకుంది.. పరీక్షలు రాసిన విద్యార్థులకు తుది ఫలితాల్లో 7 మార్కులు కలపాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రిన్సిపల్ వాల్యుయేషన్ సూచనలను డీఈవోలకు ఎస్ఎస్సీ బోర్డు అధికారులు పంపించారు .ఎస్ఎస్సీ బోర్డు ఆదేశాల మేరకు హిందీకి 2 మార్కులు, ఇంగ్లీష్‌కు 5 మార్కులను వాల్యూయేషన్ చేసే ఉపాధ్యాయులు కలపనున్నారు.
