సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో నాలుగు రాష్ట్రాల్లోని ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో వాటి ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 20వ తేదీన ఆయా స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్లు తెలిపింది.అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేసి విజేతను ప్రకటిస్తారు. ఏపీలో మూడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌తోపాటు హర్యానాలో ఖాళీ అయిన ఒక్కొక్క రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్‌లో షెడ్యూలు ప్రకటించారు.డిసెంబర్ 10వ తేదీ.. అభ్యర్థి నామినేషన్ వేసేందుకు చివరి తేదీగా నిర్ణయించినట్లు పేర్కొంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. వైసీపీ కి చెందిన బీసీ నేతలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య తమ తమ రాజ్యసభ స్థానాలకు రాజీనామా చేసిన విషయం విధితమే. ప్రస్తుతం రాజ్య సభలో ఒక్క ఎంపీ కూడా లేని తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ముగ్గురు సభ్యులను పంపడానికి మార్గం సులభమైంది. మొత్తం 11 సబ్యులకు గాను 3 రాజీనామాలతో వైసీపీ రాజ్య సభ ఎంపీల బలం ఇంకా 9 కొనసాగుతుండటం గమనార్హం..
