సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నిన్నటి నుండి ఏపీ ప్రజలలో మావోయిస్టుల కలకలం మొదలయింది. అల్లూరి సీతారామారాజు జిల్లా మారేడుమిల్లి అడువుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 7 గురు మావోయిస్టులు మరణించడం, వారి దగ్గర దొరకిన డైరీలు ఆధారంగా మరో వైపు విజయవాడ కొత్త ఆటోనగర్ లో పోలీసుల సెర్చ్ ఆపరేషన్ చేసి ఒక అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న దాదాపు 27 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చెయ్యడం పెను సంచలం అయితే వారి దగ్గర సమాచారం ఆధారంగా ప్రస్తుతం ప్రశాంతంగా ఉండే ఏలూరులో తాజగా .. గ్రీన్ సిటీలో తలదాచుకున్న 15మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. గ్రేహౌండ్ పోలీసులు అత్యంత రహస్యంగా ఆపరేషన్ కగార్‌ను నిర్వహించారు.ఇక కాకినాడ జిల్లాలోనూ పోలీసులు తనికీలు చేసి మరో ఇద్దరు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు.మరో ఇద్దరు కూడా దొరికారని తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని పోలీసులు ఇంకా ధృవీకరించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *