సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీ ప్రకటించి నిరుద్యోగులను ఊరించిన జగన్ సర్కార్ ఎట్టకేలకు ఎన్నికల ముగింట నేడు, బుధవారం ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ నేటి మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తున్నారు. మొత్తం 6 వేల 100 పోస్ట్‌లకు నోటిఫికేషన్ విడుదలకానుంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో 25 వేల పోస్ట్ లు ఖాళీగా ఉన్నాయని పోస్టుల సంఖ్యా ఇంకా పెంచాలని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి.
