సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్ : ఇటీవల టీఆరెస్ స్థానం లో భారతీయ రాష్ట్ర సమితి జాతీయ పార్టీ ని స్థాపించి దానిని ఆంధ్ర ప్రదేశ్ లో కూడా విస్తరించాలనే ప్యూహంతో అడుగులు వేసున్న తెలంగాణ సీఎం కెసిఆర్ సమక్షంలో ఇప్పటికే జనసేన లోని రాష్ట్ర స్థాయి కీలక నేతలు కొందరు చేరారు. ఇక సంక్రాంతి పండుగ తరువాత ఆంధ్రప్రదేశ్ భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభను అపూర్వముగా నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. దీనికి పార్టీ అధ్య క్షుడు కేసీఆర్ హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర అధ్యక్షుడు, తోట చంద్రశేఖర్, పార్టీ నేత చింతల పార్థసారథిలు తాజగా ప్రగతిభవన్ లో కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఏపీ రాష్ట్ర కార్యాలయాన్ని వెంటనే ప్రారంభించాలని త్వరితంగా భారీఎత్తున సభ్యత్వ నమోదు చేపట్టాలని, నిర్మా ణాత్మక వైఖరితో ముందుకొచ్చే వారిని పార్టీలో చేర్చుకోవాలన్నారు. పార్టీ గ్రామ, మండల, జిల్లా కమిటీల రూపకల్పన చేయాలని కేసీఆర్ చెప్పారు. తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి కెసిఆర్ అవసరం ఉందని..ఇప్పటికే బిఆర్ ఎస్ లో చేరేందుకు ఏపీలో ఇతర పార్టీలకు చెందిన పలు కీలక నేతలు తమను సంప్రదింపులు జరుపుతున్నారని , కెసిఆర్ కార్యదక్షత అంటే ఏపీలో ఉన్న నమ్మకం, క్రేజ్ ప్రభావం తో పార్టీ బలోపేతం అవుతుందన్నారు.
