సిగ్మాతెలుగు డాట్, న్యూస్: ఏపీలో నేడు, బుధవారం పలువురు అఖిల భారత సర్వీసు (ఏఐఎస్) అధికారులు బదిలీ అయ్యారు. ఏఐఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి నేడు, బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ను సుమిత్ కుమార్‌ను నియమించారు.ఆయన జిల్లా కేంద్రం భీమవరంలోని కలెక్టరేట్ లో ఛార్జ్ తీసుకోవలసి ఉంది. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన పి ప్రశాంతి రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా ఎం.విజయ సునీతను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే జి వీర పాండ్యన్ IAS ను పౌర సరఫరాల శాఖ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే ఐఎఫ్‌ఎస్ అధికారి రాహూల్ పాండేను జీఏడీలో రిపోర్టు చేయాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి
