సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో ఈ నెల 22వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. రెండో రోజు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం జరుగుతుంది. ఈ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లేని కారణంగా మరో మూడు నెలలపాటు తాత్కాలిక బడ్జెట్ కోసం ఈ సమావేశాల్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. దీంతో ప్రస్తుతం ఉన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌నే కొనసాగిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చే అంశంపై ప్రతిపాదనలు చేసే ఛాన్స్ ఉంది. సీఎం చంద్రబాబు కు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఫై పూర్తీ స్పష్టత వచ్చాక సెప్టెంబరులో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఆర్థిక శాఖ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఇక ఈ సమావేశాలలకు ప్రతిపక్ష నేత జగన్ వచ్చే అవకాశాలు కనపడటం లేదు. దీనితో కూటమి పక్షాలు తో అసెంబ్లీ ఏకపక్షంగా నడిచే అవకాశం కనపడుతుంది. టీవీలలో కూడా ప్రజల నుండి అంత రేటింగ్ వచ్చే అవకాశాలు కనపడటం లేదు.
