సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి ఉదయం ప్రారంభమయ్యాయి. ప్రారంభం ముందు సాంప్రదాయ ప్రకారం అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య జరిగిన ఛాంబర్ లో జరిగిన స్పీకర్ తమ్మినేని సమక్షంలో జరిగిన సమావేశంలో సీఎం జగన్ , క్యాబినెట్ మంత్రులు ప్రతిపక్ష నేతగా అచ్చేమ్ నాయుడు ను ఉద్దేశించి సభలో గొడవలకు అవకాశం లేని చర్చ జరగాలని, ప్రతిపక్షం ఏ సమస్యపై చర్చ పెట్టిన తాము సిద్ధం అని , అంతే గాని చంద్రబాబు ఆదేశాలతో మీరు రచ్చకు సిద్ధం కావద్దని కోరటం జరిగింది. తదుపరి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సీఎం జగన్ జగన్ కాబినెట్ మంత్రులు సభ ప్రారంభించగానే సభలో గందరగోళం నెలకొంది. ఇక ప్రశ్నోత్తరాల సమయంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. స్టడీ సర్కిల్ విషయంలో.. మంత్రి మెరుగ నాగార్జున సభలో సమాధానం చెపుతున్నప్పుడు టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో మంత్రి నాగార్జున తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి పై మంత్రి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. నువ్వు దళితుడివైతే, దళితులకు పుడితే.. టీడీపీ అధినేత చంద్రబాబు బంధనాల నుంచి బయటకు రావాలంటూ మంత్రి నాగార్జున సవాల్ విసిరారు. .దీంతో అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అచ్చేమ్ నాయుడు అభ్యన్తరం వ్యక్తం చేస్తూ , టీడీపీ సభ్యులతో ఆందోళలన చేపట్టారు.
