సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ అసెంబ్లీ సమావేశాలు జూన్ 19న ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరుగుతోంది. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు. ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. ఈ నేపథ్యంలో నేడు, సోమవారం, ఏపీ శాసనసభ స్పీకర్‌గా నర్సీపట్నం టీడీపీ ఎమ్మెల్యే అయ్యనపాత్రుడును టీడీపీ ఎంపిక చేసింది. దీంతో స్పీకర్ ఎన్నిక నోటిఫికేషన్ రాగానే ఆయన నామినేషన్ దాఖలు చేస్తారు. పూర్తి సంఖ్యాబలం ఉండటంతో అయ్యనపాత్రుడు ఎంపిక లాంఛనప్రాయమే. దీంతో విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాంధ్రా నుంచి స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టనున్న రెండో వ్యక్తి అయ్యన్నపాత్రుడు కానున్నారు. అలాగే విశాఖపట్నం జిల్లా నుంచి స్పీకర్ కానున్న మొదటి వ్యక్తిగా ఆయన నిలవనున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో శాసనసభ స్పీకర్‌గా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఎన్నికయ్యారు. ప్రస్తుతం అయ్యన్నపాత్రుడు స్పీకర్ బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఉత్తరాంద్ర యాసలో అవలీలగా బూతు పదాలు మాట్లాడేసే అయ్యన్న పాత్రుడు ఇప్పుడు గౌరవప్రదమైన స్పీకర్ పదవి లో ఆన్ పార్లమెంట్ పదాలు పలకకుండా ఎలా ఉన్నతంగా వ్యవహరిస్తారో చూడాలి..
