సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ పరీక్షా ఫలితాలు నేడు, శుక్రవారం విడుదల అయ్యాయి. ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల కోసం విద్యార్థులు http://resultsbie.ap.gov.in/ లో చెక్ చేసుకోవచ్చు. మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్షలలో 67శాతం ఉత్తీర్ణత సాధించగా ఫైనల్ ఇయర్ ఇంటర్ లో 78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు మొత్తం 4,61,273 మంది విద్యార్థులు హాజరవగా.. 3,10,875 మంది విద్యార్థులు పాస్ అయ్యారు.సెకండ్ ఇయర్ పరీక్షలకు మొత్తం 3,93,757 మంది విద్యార్థులు హాజరవగా.. 3,06,528 మంది ఉత్తీర్ణత సాధించారు.సౌరబ్ గౌర్ మాట్లాడుతూ.. ఈసారి ఇంటర్ పాస్ పర్సంటేజ్‌లో బాలికలే పైచేయి సాధించారని ప్రకటించారు పరీక్షల్లో ఉత్తీర్ణం కాలేని పిల్లలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పిల్లలకు ఈ ఫలితాల వల్ల ఫ్యూచర్ ప్రభావితం కాదన్నారు. ఎవరైనా విద్యార్థులు మానసిక ఆందోళనలో ఉన్నట్లు గమనిస్తే వెంటనే హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. AP Telemanas – 14416(Toll Free) మరియు Roshini Helpline – 8142020044, 8142020033 మరియు 1Life – 7893078930 ను సంప్రదించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *