సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇంజనీరింగ్ విద్య కోసం ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ (ఏపీ ఈఏపీసెట్) ఫలితాలను, ‘ఒక రోజు ముందుగా’ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా నేడు, ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. మరోవైపు జేఎన్టీయూ కాకినాడ వీసీ ప్రొ. సీఎస్ఆర్‌కే ప్రసాద్ తన కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్‌లో తెలంగాణకు చెందిన ఎ.అనిరుధ్ రెడ్డి మొదటి ర్యాంకు.. శ్రీకాళహస్తికి చెందిన ఎం. భానుచరణ్ రెడ్డి రెండో ర్యాంకు.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కె. వై. సాత్విక్ మూడో ర్యాంకు సాధించారు.ఇక అగ్రికల్చరల్, ఫార్మసీలో మొదటి మూడు ర్యాంకులు సాధించిన వారు..అగ్రికల్చరల్‌లో కృష్ణాజిల్లా పెనమలూరుకు చెందిన వెంకట నాగసాయి హర్షవర్ధన్ మొదటి ర్యాంకు సాధించారు. పరీక్షల్లో ఇంజనీరింగ్ విభాగానికి మొత్తం 2.64 లక్షల మంది హాజరయ్యారు. 1.8 లక్షల మంది అర్హత సాధించారు. 71.65 శాతం మంది పాసయ్యారు.అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో నిర్వహించిన పరీక్షల్లో 75.4 వేల మంది హాజరయ్యారు. వారిలో 67.7 శాతం మంది అర్హత సాధించారు. 89.8 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ర్యాంక్ కార్డుల కోసం ఈ కింద లింక్‌పై క్లిక్ చేయాలి.. cets.apsche.ap.gov.in/EAPCETఅలాగే వాట్సప్ నెంబర్: 9552300009 ద్వారా పొందవచ్చు.
