సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజగా.. ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు (AP EDCET 2025) విడుదలయ్యాయి. నేడు, శుక్రవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Lokesh) ఈ ఫలితాలను సోషల్ మీడియా ఎక్స్ వేదికగా విడుదల చేశారు. గణితం, భౌతిక శాస్త్రాలు, సామాజిక అధ్యయనాలు, జీవశాస్త్రం, ఇంగ్లీష్ ఇలా మొత్తం ఐదు విభాగాల్లో 99.42 శాతం అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. మొత్తం 17,795 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకోగా వారిలో 14,527 మంది అర్హత సాధించారని ప్రకటించారు. వారి ర్యాంక్ కార్డులను https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/EDCET_GetRankCard.aspx లో చూసుకోవచ్చు. అలాగే మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చును.
