సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల దేశవ్యాప్తంగా ఏపీ , ఒరిసా ఎన్నికలలో ఈవీఎం లలో ఎదో’ జరిగిందని ఏపీలో పడిన ఓట్ల కంటే 12న్నర శాతం ఓట్లు అదనంగా వచ్చి చేరాయని తీవ్ర ప్రచారం అందరికి తెలిసిందే.. అయితే దీనిపై ఈసీ కూడా పెద్దగా స్వాదించడం లేదు.. ఒంగోలు , బొబ్బిలి నియోజక వర్గాలలో ఈవీఎం బాక్స్ లలో ఓటర్ స్లిప్ లు తిరిగి లెక్కించాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కోర్ట్ ఆదేశాలు తెచ్చినప్పటికీ ఈసీ ఆ దిశగా అడుగులు వెయ్యడానికి సిద్ద పడక పోవడం ఏపీలో జరిగిన ఎన్నికపై తనకు అనుమానాలు ఉన్నాయని, ఈసీ ఇప్పటి వరకు ఏపీలో నియోజకవర్గాల వారీగా అధికారికంగా మొత్తం పోలైన ఓట్లు కౌంటింగ్ జరిగిన ఓట్లు లిస్ట్ ఇప్పటి వరకు ఇవ్వకపోవడం అనుమానస్వదంగా ఉందని పైగా ఈవీఎం లోని లెక్కించిన ఓట్లు 10 రోజులలలో తీసెయ్యమని ఈసీ ఆదేశించడం రాజ్యాంగ విరుద్ధం అని రాజకీయ ఉద్దండుడు , మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొనడం దానికి తగిన ఆధారాలు తో మరల ప్రెస్ మీట్ పెడతానని ప్రకటించడం తో రాష్ట్రంలో ఒక అలజడి నెలకొంది. ఈనేపథ్యంలో నేడు, మంగళవారం సచివాలయం లో ఎన్నికల ప్రధానాధికారిని YSRపార్టీ బృందంకలిసింది ఏపీ సీఈవోను కలిసిన టీమ్‌లో.. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మెరుగ నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితర నేతలు ఉన్నారు.. అంబటి రాంబాబు మాట్లాడుతూ..రాష్ట్రంలో కూటమి గెలుపు ఫై ఓట్ ఫర్ డెమాక్రసీ అనే సంస్థ పోలింగ్‌పై ఆధారాలు చూపిస్తూ అనుమానాలు వ్యక్తం చేసింది. ఏపీలో 68.12 శాతం పోలిం గ్ పూర్తి అయిందని ఈసీ చెప్పింది. తర్వాత 76.5 శాతానికి పెరిగింది. ఫైనల్‌గా 80.66శాతం గా ప్రకటించారు. ఓటింగ్ పూర్తీ అయ్యాక నెల రోజుల తరువాత కౌంటిం గ్ సమయంలో 82 శాతం పోలిం గ్ జరిగినట్లుగా ఈసీ చెప్పిందన్నారు ఇవాల్టీవరకు ఫామ్-20 అంటే ఏ నియోజకవర్గం లో ఎన్ని ఓట్లు.. ఎవరికి పోల్ అయ్యాయని చెప్ప లేదన్నారు అంబటి రాంబాబు.. ఇదోక అసాధారణమైన చర్య .. ఎందుకు ఆలస్యం అయింది. ఫైనల్ ఫిగర్‌కి కౌంటింగ్ ఫీగర్‌కి ఎందుకు తేడా వచ్చింది.. భారత ఎన్నికల సం ఘం ఈ అనుమానాలు నివృత్తి చేయాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *