సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ ఎన్నికల్లో కీలక ఘట్టమైన అభ్యర్థుల నామినేషన్ల పర్వము నేటి గురువారం మధ్యాహ్నం 3 గంటలకు .. ముగిసిపోగా రేపు (శుక్రవారం) నామినేషన్ల పరిశీలన జరుగనుంది. ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ గా ప్రకటించారు. ఆ తర్వాత ఎన్నికల సమరంలో ఉండే తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. అలాగే మే 11 సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. మే 13న తెలంగాణలోని పార్లమెంట్ స్థానాలకు… ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అలాగే జూన్ 4న ఫలితాలు ప్రకటిస్తారు. ఇదిలా ఉండగా.. ఏపీలో లోక్‌సభ స్థానాలకు 600కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఏపీ లో అసెంబ్లీ స్థానాలకు 3,300కు పైగా నామినేషన్లు ఫైల్ అయ్యాయి. ఈరోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా.. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. వైసీపీ అధినేత సీఎం జగన్ నేడు, శుక్రవారం పులివెందులలో నామినేషన్ వెయ్యడం నామినేషన్ పర్వములో ఆఖరి రోజు ఒక హైలైట్.
