సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్ష నేడు, బుధవారం ఉదయం 10న్నర కు ఏపీ సచివాలయంలో కేబినెట్ భేటీ (AP Cabinet ) ప్రారంభం అయ్యింది. ఈ సమావేశంలో వచ్చే పిబ్రవరి నెలలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీల ఖరారు, కొత్త పెట్టుబడులు, భూ కేటాయింపులతో పాటు సుమారు 35 అంశాల ఫై చర్చ జరుగుతుంది. రానున్న రాష్ట్ర బడ్జెట్ అజెండాలో సంక్షేమం, మౌలిక సదుపాయాలు, యువతకు ప్రోత్సాహం వంటి అంశాలకు పెద్దపీట వేయనున్నారు.త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్‌ను కేబినెట్ ఖరారు చేసే అవకాశం ఉంది. పేదలకు భూ కేటాయింపులు: రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి వివిధ సంస్థలకు భూములు కేటాయించే ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది.. ఇటీవల తన దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి, పారిశ్రామికవేత్తల మధ్య కుదిరిన ఒప్పందాలపై , . ఏపీ పెట్టుబడుల అమలుపైచర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే సాయంత్రం రైల్వే ప్రాజెక్టులపై సమీక్షించనున్నారు. పలు పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిపై చర్చించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *