సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు, సోమవారం ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బాబు చేసిన ఐదు సంతకాలకు కేబినెట్ ఆమోదించింది. మెగా డీఎస్సీ నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మెగా డీఎస్సీలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆమోదం పొందిన మిగతా నిర్ణయాల్లో.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలలో ఆగస్టు నెలలో ఒకేసారి 183 అన్న క్యాంటీన్లు పునరుద్ధరణ చెయ్యాలని తీర్మానించారు.ఇక కీలకమైన . పింఛన్ల పెంపు, స్కిల్ సెన్సెస్ ఉన్నాయి. పింఛన్ల పథకానికి ఎన్టీఆర్ భరోసాగా ఇప్పటికే పేరు మార్పు చేసిన విషయం తెలిసిందే. అనంతరం పింఛన్ల పెంపుపై మంత్రివర్గంలో చర్చించారు. ఈ వచ్చే జులై 1వ తేదీ నుండి పింఛన్లను వాలంటీర్లకు బదులు సచివాలయ సిబ్బంది తో ఇంటింటికి పంపిణి చెయ్యాలని నిర్ణయించారు. దీనితో 2న్నర లక్షల మంది పనిచేస్తున్న వాలంటీర్ వ్యవస్థ అసలు పునరుద్ధరిస్తారా? అన్నది సస్పెన్సు లో పడింది. ఇప్పటికే భీమవరంలో పట్టణంలో సైతం వార్డ్ సచివాలయాల ఉద్యోగులు ఇంటింటికి తిరిగి ఇంటి పన్నుల బిల్లులు స్వయంగా ఇస్తుండటం గమనార్హం. గత వైసీపీ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు పెంచిన ఆస్థి పన్నులు కొనసాగింపులే తప్ప ఎటువంటి రాయితీలు ఇవ్వకపోవడం గమనార్హం. అన్ని జిల్లాలకు రేపు లేదా ఎల్లుండి ఇన్చార్జిలను నియమిస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రకటించారు.
