సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం సీఎం చంద్రబాబు (CM Chandrababu ) అధ్యక్షన, డిప్యూటీ సీఎం పవన్ సమక్షంలో జరిగిన కేబినెట్ సమావేశంలో 44 అజెండా అంశాలపై చర్చించి.. నిర్ణయం తీసుకున్నారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో రూ.9,500 కోట్లతో 506 ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులకు కేబినెట్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. రాజధాని అమరావతిలో శాశ్వత నిర్మాణాలుగా లోక్‌భవన్‌, అసెంబ్లీ దర్బార్‌ హాల్‌ గవర్నర్‌ కార్యాలయం, గెస్ట్‌ హౌస్‌లు, స్టాఫ్‌ క్వార్టర్ల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ అనుమతి ఇచ్చింది.ఇంకా రాష్ట్రంలో సీడ్ యాక్సెస్ రహదారిని 16వ హైవేకి అనుసంధాన పనులకు రూ.532 కోట్లకు కేబినెట్ ఆమోదం లభించింది. రూ.20 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 26 సంస్థలకు, గిరిజన సంక్షేమశాఖలో 417 భాషా పండితుల పోస్టులను స్కూల్‌ అసిస్టెంట్‌లుగా పదోన్నతికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *