సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు సారధ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ సమక్షంలో జరిగిన ఈ భేటీలో మంత్రుల మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పంటల బీమా పథకానికి ప్రీమియం చెల్లింపుపై విధివిధానాల ఖరారుకు ముగ్గురు మంత్రులతో కమిటీ వేయాలని కేబినెట్ నిర్ణయించింది. వ్యవసాయ మంత్రి అచ్చం నాయుడు, రెవెన్యూ మంత్రి అనగాని, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కమిటీ సభ్యులుగా ఉంటారు.ప్రీమియం చెల్లింపు స్వచ్ఛందంగా రైతులు చేయాలా? లేక ప్రభుత్వం చెల్లించాలా అనే అంశాన్నిఫై రెండు రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ,కొత్త ఇసుక విధానానికి కెబినెట్ ఆమోదం లభించింది. కొత్త ఇసుక పాలసీపై త్వరలో విధి విధానాలను రూపొందించనున్న ప్రభుత్వం.. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ రూ.2 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీకి ఆమోదం లభించింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్సీడీసీ నుంచి రూ.3200 కోట్ల రుణానికి వ్యవసాయ, సహకార కార్పోరేషన్‌కు ప్రభుత్వ గ్యారెంటీకి కేబినెట్ ఆమోదం.లభించింది.
