సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇండోనేషియా సముద్ర తీరంలో ఏర్పడిన ‘సెన్‌యార్’ తుఫాన్ ముప్పు తప్పిందనుకుంటే.. ‘దిత్వా’ (ditwa) రూపంలో మరో తుఫాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంపైకి దూసుకొస్తోంది. దీనివల్ల కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు పెనుగాలులు ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీలంకకు సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా అనంతరం తుఫాన్‌గా మారింది. దీనికి యెమన్ దేశం సూచించిన ‘దిత్వా’గా భారత వాతావరణ శాఖ(ఐఎండీ) పేరు పెట్టింది. తుఫాను గంటకు 10 నుంచి 15 కి.మీ వేగంతో.కదులుతూ ఈ నెల 30వ తేదీ ఉదయానికి తమిళనాడు, కోస్తాంధ్ర తీరాల వైపు రానుందని ఐఎండీ తెలిపింది. పలు వాతావరణ మోడళ్ల మేరకు 30 ఉదయం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మధ్య తీరం దాటనుంది. దీని ప్రభావం కోస్తాలో కోనసీమ జిల్లా నుంచి నెల్లూరు వరకూ, రాయలసీమలో కొన్ని జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.
