సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎలక్షన్ కమిషన్ పూర్తీ అధికార బాధ్యతలు చేపట్టాక ఇటీవల జరిగిన ఎన్నికల పోలింగ్ సమయంలో పలు ప్రాంతాలలో చెలరిగిన హింసకు అధికార విపక్షాలు మీరు బాద్యులు మీరు బాద్యులు అంటూ విమర్శించుకోవడం.. రాష్ట్రంలో అధికారాలు లేనప్పటికీ వైసీపీ పార్టీ ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతుండగా, ఇటు టీడీపీ జనసేన కూటమికి కేంద్రంలో బీజేపీ పెద్దల అండ ఉంది.. వాస్తవానికి ‘తిలా పాపం తలా పిడికెడు’.. మధ్యలో ఏపీ పోలీసులు అధికారులు ఇరుక్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీసు చరిత్రలోనే తొలిసారిగా ఎన్నికల విధుల్లో వైఫల్యంపై విచారణకు రాష్ట్ర పోలీస్‌ శాఖ ఊహించని రీతిలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఏర్పాటైంది. కేంద్ర ఎన్నికల సంఘం సిఫారసు మేరకు 13మంది పోలీసు అధికారుల బృందం దర్యాప్తునకు సిద్ధమైంది. నిఘా విభాగం ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ ఈ టీమ్‌కు నేతృత్వం వహిస్తారు. పల్నాడు, తాడిపత్రి, తిరుపతి ప్రాంతాల్లో పోలింగ్‌, అనంతర హింసను కట్టడి చేయడంలో పోలీసు అధికారుల వైఫల్యంపై బ్రిజ్‌లాల్‌ బృందం దృష్టి సారించనుంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో పల్నాడు, తిరుపతి, అనంతపురం ఎస్పీలు, కొందరు పోలీసు అధికారులు, పల్నాడు కలెక్టరుపై సీఈసీ వేటు వేసిన విషయం తెలిసిందే. వీరిలో కొందరిని బదిలీపై పంపితే, మరికొందరిని ఏకంగా సస్పెండ్‌ చేసింది. ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌ గుప్తాలను ఢిల్లీకి పిలిపించుకుని వారి సంజాయిషీ తెలుసుకొంది. హింసాత్మక ఘటనలపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని, కేంద్ర సాయుధ బలగాలతో ఆయా ప్రాంతాల్లో శాంతి భద్రతలు అదుపు చేయాలని ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *