సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: హైదరాబాద్ లో మాజీ కేంద్రమంత్రి యువి కృష్ణంరాజు భౌతిక కాయానికి ఘన నివాళ్లు అర్పించడానికి నేడు, సోమవారం ఉదయం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరపున రాష్ట్ర మంత్రులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు , రోజా, పినిపే విశ్వరూప్ చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మరియు ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు హాజరుఅయ్యారు. నరసాపురం మాజీ ఎంపీగా , మాజీ కేంద్రమంత్రివర్యులు పనిచేసిన యువి కృష్ణంరాజు అకాల మరణం కలచివేసిందని, వారు మన ప్రాంతాల అభివృద్ధికి , ప్రజలకు చేసిన సేవలు అపూర్వమని, ఆయన సినిమాలలో నైనా, రాజకీయాలలోనైన గౌరవప్రదంగా , రారాజుగా వ్యవహరించారని కొనియాడుతూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరపున,సీఎం జగన్ తరపున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. నేడు, మధ్యాహ్నం జరగబోయే స్వర్గీయ కృష్ణంరాజు అంత్యక్రియల్లో రాష్ట్ర ప్రభుత్వం తరుపున అధికారికంగా అక్కడే ఉండి పాల్గొంటున్నారు.
