సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు, గురువారం కీలక నియమాకాలపై ఉత్తర్వులు జారీచేసింది. ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా సీనియర్ జర్నలిస్ట్ కొమ్మి నేని శ్రీనివాసరావును నియమిస్తూ ఉత్తర్వు లు జారీ చేసిం ది. ఆయనను కేబినెట్ హోదాతో నియమిస్తూ ప్రభుత్వం గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా,ప్రెస్ అకాడమీ చైర్మెన్ గా రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.:సుమారు 4దశాబ్దాలుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలతో పాటు టీవీ 5, ఎన్టీవీ న్యూస్ ఛానెల్స్ తో పాటు ప్రస్తుతం సాక్షి ఛానెల్ లో పలు టాక్ షో లు, పత్రిక పుస్తక రచనలు చేసిన లబ్ద ప్రతిష్టుడు కొమ్మినేని.. ఇక ప్రముఖ సీనియర్ నటుడు, దర్శకుడు, నిర్మాత, కధ , మాటలు రచయిత పోసాని కృష్ణ మురళిని ఆంధ్రప్రదేశ్ ఫిలిం కార్పొరేషన్ ఛైర్మెన్ గా నియమిస్తూ నేడు, గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
