సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ప్రజలకు అతి తక్కువ ధరలకు కేబుల్ టివి, ఇంటర్ నెట్ సేవలు అందిస్తూ ప్రజలు మన్ననలు అందుకొన్న ఏపీ ఫైబర్‌నెట్ గత ఏడాదిగా తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న విషయం అందరికి తెలిసిందే.. స్కామ్లు జరిగాయని ఆరోపణలు, చైర్మెన్ ల రాజీనామాలు, వందలాది ఉద్యోగుల తొలగింపు , సిగ్నెల్స్ రోజుల కొలది పలు ప్రాంతాలలో ఆగిపోవడం నేపథ్యంలో 6 లక్షలు పైగా కలిగిన వినియోగదారుల సంఖ్య తీవ్ర స్థాయిలో సగానికి పడిపోయిందని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూటమి సర్కార్ కార్యాచరణ ప్రారంభించింది. కార్పొరేషన్‌లో (AP FiberNet Corporation) సంస్కరణలు కొనసాగుతున్నాయి. ఏపీ ఫైబర్‌నెట్ టెక్నికల్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం పునర్ నియమించింది. తొమ్మిది మంది సభ్యులతో ఫైబర్‌నెట్ టెక్నికల్ కమిటీని నియామకం చేసింది. సభ్యులుగా ఫైబర్‌నెట్ ఎండీ, ఐటీశాఖ ప్రత్యేక కార్యదర్శి, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఎండీని నియమించింది. ఎస్ఎఫ్ఎల్‌లో డీపీఆర్‌లు, టెండర్ల పరిశీలనకు ఈ కమిటీ ఆమోదం తెలపనుంది. వాణిజ్య, టెక్నికల్ కార్యాక్రమాలను ఫైబర్‌నెట్ టెక్నికల్ కమిటీ పర్యవేక్షిస్తుంది.
