సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత వైసీపీ సర్కార్ హయాంలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్స్ లేఖలకు కలియుగ వైకుంఠం లో భక్తుల రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వ వచ్చాక తెలంగాణ లోని కాంగ్రెస్ హయాంలోని రేవంత్ రెడ్డి సర్కార్ విజ్ఞప్తి మేరకు సీఎం చంద్రబాబు ఆదేశాలతో తిరుమలలో శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సులను అనుమతించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. ఈనేపథ్యంలో నిన్న ఆదివారం తొలి రోజే పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజా ప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలు అందాయి. ఆదివారం ఒక్క రోజే 90 మంది ప్రజా ప్రతినిధులు ఈ సిఫార్సు లేఖలను జారీ చేశారు. ఈ సిఫార్సు లేఖలను నిన్న అదనపు ఈవో కార్యాలయ అధికారులు స్వీకరించారు. మన ఏపీ భక్తులకే రోజు వీఐపీ దర్శనాలు కష్టం అవుతున్న నేపథ్యంలో తెలంగాణ వీరికి ఈరోజు (సోమవారం) వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు. అయితే తెలంగాణాలో ఇటీవల రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణాలో ఇంజనీరింగ్ కాలేజీలలో ఏపీ విద్యార్థులకు సీట్లు ఇచ్చేలా ఉన్న తెలంగాణ ఎంసెట్ లో ఏపీ విద్యారుల కోటా ఈ ఏడాది నుండి తొలగించారు. అలాగే ఇటీవల అక్కడ ఉన్న పొట్టి శ్రీ రాములు యూనివర్సిటీ పేరు ను తొలగించి తెలంగాణ రచయితే సురవరం పేరు పెట్టాలని కాబినెట్ ఆమోదించింది. మరో ప్రక్క కృష్ణ జలాలను రాయలసీమ వారు దోచేస్తున్నారని వివాదం పెద్దది చేస్తున్నారు. మరి ఏపీ లో NDA కూటమి సర్కార్ కు ఎందుకు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఫై ఔదార్యం ప్రదర్శిస్తుందో ? ఇప్పటికైనా సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వారి నివాసాలు హైదరాబాద్ నుండి పూర్తిగా ఏపీకి మారిపోతే మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *