సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి పండుగ కు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ జంట నగరాల నుంచి విజయవాడ మీదుగా నర్సా పూర్ , కాకినాడ టౌన్, తిరుపతి మధ్య మరో 16 ప్రత్యేక రైళ్లు సర్వీ సులు నడపనున్నారు. వీటిలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మీదుగా జనవరి 8న వికారాబాద్–కాకినాడ టౌన్ (07051), 9న కాకినాడ టౌన్–కాచిగూడ (07057), 12న వికారాబాద్– నర్సాపూర్ (07071), 13న నర్సాపూర్–కాచిగూడ (07072),14న హైదరాబాద్–నర్సాపూర్ (07085), 15న నర్సాపూర్–హైదరాబాద్ (07086), 16న వికారాబాద్–నర్సాపూర్ (07080), 17న నర్సాపూర్–కాచిగూడ (07081) మధ్య రైళ్లు నడపనున్నారు.
