సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ లోని దాదాపు అందరు కీలకనేతలు ఫై ఎన్నో కేసులు వరుసగా నమోదు కావడం ..కేసులన్నీ విచారణలు కొనసాగుతూనె .. ఉండటంతో .. కాస్త ఆలస్యం అయిన వారు ఫై కోర్టులకు వెళ్లి బెయిల్ ఫై బయటకు వచ్చేస్తుండటం తెలుగు రాష్ట్రాల ప్రజలు చూస్తూనే ఉన్నారు. లిక్కర్ కేసు నమోదు కావడంతో విచారణ పేరుతొ.. రాజమండ్రి సెంట్రల్ జైలులో కోర్ట్ ఆదేశాలతో అన్ని ఆధునిక సౌకర్యాలు తో ఉన్న వైసీపీ హ్యాట్రిక్ ఎంపీ మిదున్ రెడ్డి కి కూడా తాత్కాలిక బెయిల్ వచ్చేసింది. ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలోఆయన ఢిల్లీ వెళుతున్నారు. ఇక తాజగా ఏపీ లిక్కర్ స్కాం కేసులో (AP liquor Scam) ఏ31 ధనుంజయ రెడ్డి, ఏ32 కృష్ణ మోహన్ రెడ్డి, ఏ33 బాలాజీ గోవిందప్పలకు విజయవాడ ఏసీబీ కోర్టు నిన్న(శనివారం) బెయిల్ ఇవ్వడంతో వారిని నిన్నశనివారం సాయంత్రం విడుదల చెయ్యడం కుదరదని ఉదయమే 6 గంటలకు విడుదల చేస్తామని చెప్పటంతో లాయర్లు నేడు, ఆదివారం ఉదయం విజయవాడ జిల్లా జైలు కు చేరుకొన్నారు . నాటకీయ పరిణామాలు మధ్య జైలు అధికారాలు వారిని విడుదల చెయ్యలేదు. లాయర్లు అందరు అక్కడే నిరసనగా బెటాయించడం కోర్ట్ ధిక్కరణ క్రిందకు వస్తుందని పోలీసులను వారు హెచ్చరించడం దరిమిలా, మీడియాలోకూడా రచ్చ మొదలు కావడంతో ఆముగ్గురుని ఉదయం 10 గంటల సమయంలో విడుదల చేసారు. ఇంతకీ ట్విస్ట్ ఏమిటంటే.. నిందితులకు ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (AP High Court) సిట్ అధికారులు.. హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు . విచారణ ఈ రోజు ఆదివారం జరిగే అవకాశం ఉంది. దానితో వారిని బయటకు పంపాలా ? వద్దా ? అనే సంశయం జైలు అధికారులలో నెలకొంది. అయితే కావాలనే ఫై స్థాయి నుండి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో తమను ఆలస్యంగా విడుదల చేశారని ధనుంజయ రెడ్డి తెలిపారు. అనంతరం ముగ్గురు నిందితులు తమ నివాసాలకు వెళ్లిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *