సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: ఇటీవల పెద్ద హీరోల కొత్త సినిమాలు విడుదల అవుతున్నాయి. టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ దుమ్ము లేపుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సినిమా థియేటర్ లో టికెట్స్ ధరలు తగ్గించడం తో బీసీ సెంటర్స్ లో సైతం అఖండ వంటి సినిమాలకు రిపీట్ ఆడియన్స్ పెరిగి థియేటర్స్ తో పాటు అటు క్యాంటీన్స్, సైకిల్ స్టాండ్ వంటి భారీగా ఆదాయం పెరిగి లాంగ్ రన్ లో సినిమా నిలబడుతున్నట్లు సమాచారం. అయితే కొందరు ప్రముఖ సినీ నిర్మాతల చేతిలో ఉన్న లీజ్ థియేటర్స్ కు ఈ టికెట్స్ ప్రభుత్వ తగ్గింపు రేట్లు రుచించక, స్థానిక జిల్లా కలెక్టర్లు కు టికెట్స్ పెంచాలని అర్జీలు పెట్టి అవే పర్మిషన్ లెటర్స్ గా చూపిస్తూ పెద్ద ఎత్తున టికెట్స్ రేట్లు పెంచి పబ్లిక్ దందా మొదలు పెట్టేసారు. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా పిర్యాదులు వచ్చిన సినిమా హాళ్ళపై అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన పలు థియేటర్లను నేడు, బుధవారం సీజ్ చేశారు. నూజివీడు, అవనిగడ్డ, గుడివాడలో తనిఖీలు చేపట్టారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ టిక్కెట్ల ధరలు, ఫుడ్ స్టాల్స్‌లో ధరలపై అధికారులు ఆరా తీశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు.కృష్ణాజిల్లాలో జాయింట్ కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ.. కృష్ణాజిల్లాలో 12 థియేటర్లు సీజ్ చేశామని తెలిపారు. లైసెన్సులు రెన్యూవల్ చేయని థియేటర్లు సీజ్ చేశామని పేర్కొన్నారు. తనిఖీలు రెగ్యులర్‌గా కొనసాగుతాయన్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లో మరికొన్ని పట్టణాలలో సైతం గత ఆదివారం ఎక్కువ ధరకు టికెట్స్ అమ్మినట్లు పిర్యాదు లు వచ్చిన థియేటర్స్ ఫై వెంటనే అధికారులు దాడులు చెయ్యడం, దానితో థియేటర్స్ వాళ్ళు , ప్రేక్షకులకు డబ్బులు తిరిగి ఇచ్చేయడంతో లాస్ట్ వార్నింగ్ అంటూ సరిపెట్టినట్లు సమాచారం. థియేటర్లలో తిను బండరాలు( పాప్ కార్న్ 100 రూపాయలు, సమోసా 50 రూ అమ్మేయడం.. వంటి దారుణ దోపిడీ ఫై కూడా ), పార్కింగ్ విషయంలో దోపిడీ చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు సైతం తనిఖీలు చేస్తారన్నారు.
