సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో గ్రంధి వెంకటేశ్వర రావు జూనియర్ కళాశాలలో నేటి శుక్రవారం జరిగిన జగనన్న విద్య దీవెన’ నిధుల విడుదల చేసిన సీఎం జగన్ విద్యార్థులు వారి తల్లి తండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ.. అందరి తలరాతలు మార్చే ఆస్తి చదువు.. మీ అందరి మధ్య ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం భీమవరం నుంచి చేస్తున్నాం . ఈ రోజు పెద్ద చదువులు చదువుతున్న పిల్లల మామయ్యగా ఫీజుల డబ్బు ను ప్రభుత్వం తరపున పిల్లల తల్లుల ఖాతాల్లోకి, పిల్లలు కూడా ఉన్న జాయింట్ ఖాతాల్లోకి ప్రతి మూడు నెలలకోసారి పూర్తి ఫీజురీయింబర్స్మెంట్ ను జమా చేస్తున్నాం ఈ రోజు రాష్ట్రంలో 8 లక్షల 9 వేల 39 మంది విద్యార్థుల కోసం బటన్ నొక్కి 7,47,920 మంది తల్లుల ఖాతాల్లోకి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించిన 583 కోట్లను జమా చేస్తున్నం, ఫైనలియర్ విద్యార్థులకు ఇబ్బం ది లేకుండా 2 లక్షల విద్యా ర్థులకు చివరి వాయిదా పీజు కూడా ఇప్పటికే వారి తల్లుల ఖాతాల్లోఇప్ప టికే జమ చేశాం .ఈ నాలుగున్నర ఏళ్లలో విద్యా దీవెన అనే ఒక్క పథకం ద్వా రా 27,61,000 మంది పిల్లలకు వారి పూర్తి ఫీజులు చెల్లింపులతో పాటు పిల్లలు చదువులే కాదు, వాళ్ల వసతి దీవెన కార్య క్రమాలతో కలిపి ఖర్చు చేసింది రూ.16,176 కోట్లు అని ప్రకటించారు, గత ప్రభుత్వం ఎగ్గొటిన విద్యార్థుల కాలేజీ పీజుల బకాయిలు కూడా చెల్లించామని మొత్తం 18 వేల కోట్ల ఫై మాటే చెల్లించామన్నారు. ప్రభుత్వ స్కూల్స్ ను విద్యను ఆధునీకరించి మన పేద విద్యార్థులనుసైతం అంతర్జాతియ ప్రమాణాలతో ఉచితంగా చదివిస్తున్నామని, వారి తల్లితండ్రులు అప్పులు పాలు కాకుండా విద్య సామాగ్రి అందిస్తూ.. వసతి , ఆహారం ఖర్చులు భరిస్తున్నామని భవిషత్తు లో ఏపీ విద్యార్థులు ప్రపంచములో అద్భుతాలు చేస్తారని విశ్వసిస్తున్నానని, అందుకే విద్య వ్యవస్థ కోసం గత 4న్నర ఏళ్లుగా విద్యారంగం పై అక్షరాలా రూ.73,417 కోట్లు ప్రభుత్వ నిధులు పారదర్సకంగా ఖర్చు చేసి ప్రతి ఇంటి నుండి ఇంజనీరింగ్, కలెక్టర్లు, డాక్టర్లు రావాలని, ఆ కుటుంబాల తలరాతలు మారాలని తపనతో అడుగులు వేస్తున్నానని విద్యారుల హర్షద్వానాల మధ్య ప్రసంగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *