సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్ ( ప్రపంచ వ్యాప్తంగా పిల్లల పాఠ్య పుస్తకాలలో కూడా.. కాళ్ళు చేతులు లేకపోయిన ఇతను మనోనిష్ఠతో సాధించిన అద్భుతాలు స్ఫూర్తిదాయకంగా పాఠ్యంశాలు ఉంటాయి.) గుంటూరు లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులతో కొద్దీ సేపు గడిపి వారి ప్రజ్ఞ పాటవాలను , టీచర్లు ను ప్రశంసించారు. తదుపరి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ ని కలిశారు. సీఎం జగన్ తన స్థానం నుండి లేచి నిక్ ను ప్రేమపూర్వకంగా ఆలింగనం చేసుకొన్నారు. ఈ సందర్భముగా నిక్ పుజిసిక్ మాట్లాడుతూ..‘‘దాదాపు ఏడెనిమిది దేశాల్లో నేను పర్యటించాను. అయితే ఎంతో దూరదృష్టి తో విద్య , వైద్యం , వ్యవసాయ రంగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్న ఏపీ సీఎం జగన్ లాంటి వ్య క్తిని నేను ఇంతవరకూ చూడలేదు. ఆయన ఉన్నతమైన ఆశయంతో పనిచేస్తున్నరు. నా పరిశీలనలో ఏపీలో సుమారు 45వేల ప్రభుత్వ స్కూ ళ్లను ఏ ప్రయివేటు స్కూ ళ్లకు తీసిపోనిరీతిలో అభివృద్ధి చేశారు. ఇక్కడ(ఏపీలో) విద్యా రంగంలో పిల్లల ఎదుగుదలకు మంచి అవకాశాలున్నా యి. ప్రపంచ స్ధాయి ప్రమాణాలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ విషయం లో సీఎం జగన్ గురించి చెప్పాలంటే ఆయన హీరో. ఇంతవరకూ ప్రపంచంలో ఇలా ఎక్కడా జరగలేదు. సీఎం చాలా నిబద్ధత, క్రమశిక్షణ గల మనిషి’’ అనినిక్ వుజిసిక్ అని అభినందించారు. జగన్ కృషి ప్రపంచం లో అందరికీ తెలియాల్సి ఉంది’’ అన్నారు.
