సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం రాబోతుంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల నుంచి ఎలాంటి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వాటిలో కీలక మార్పులు వివరాలు: ఏప్రిల్ 1, 2024 నుంచి ఇన్కమ్ టాక్స్ ఆదాయపు పన్ను ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు. ఈ పెరిగిన మినహాయింపు ద్వారా అనేక మంది పన్ను చెల్లింపుదారులకు ఊరట లభించనుంది. ఈ నేపథ్యంలో రూ.3 లక్షల నుంచి 6 లక్షల ఆదాయంపై 5%, రూ.6 లక్షల నుంచి 9 లక్షల వరకు 10%, రూ.9 లక్షల నుంచి 12 లక్షల వరకు 15%, రూ.12 లక్షల నుంచి 15 లక్షల వరకు 20% పన్ను విధించబడుతుంది. ఆ తర్వాత రూ. 15 లక్షలు, అంతకంటే ఎక్కువ ఆదాయం ఉంటే 30% పన్ను విధించబడుతుంది.అంతేకాదు ఆదాయపు పన్ను చట్టం(IT Act) 1961లోని సెక్షన్ 87A కింద మినహాయింపు రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచబడింది. అంటే కొత్త విధానంలో రూ. 7 లక్షల వరకు పన్ను విధానం నుంచి తప్పించుకోవచ్చు.ప్రభుత్వేతర ఉద్యోగులకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ పన్ను మినహాయింపు పరిమితి ప్రస్తుతం రూ.3 లక్షలు ఉండగా, అది ఇప్పుడు రూ.25 లక్షలకు పెంచబడింది.ఇకపై పాత పద్దతి వదిలేసి కొత్త పన్ను విధానంలో పన్ను చెల్లిస్తారు. ఇంతకుముందు రూ. 5 కోట్ల కంటే ఎక్కువ ఆదాయంపై 37% సర్‌ఛార్జ్ ఉండేది. ఇప్పుడు దాన్ని 25 శాతానికి తగ్గించారు. అంటే రూ.5 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటే ఇప్పుడు తక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.జీవిత బీమా పాలసీల నుంచి మెచ్యూరిటీ రాబడి మొత్తం ప్రీమియం రూ.5 లక్షల కంటే ఎక్కువ ఉన్న పాలసీలపై ఈ పన్ను చెల్లించాలి.
