సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: 2022-23 ఆర్థిక సంవత్సరం పూర్తయి కొత్త ఆర్థిక సంవత్సరం (2023-24) ప్రారంభం కాబోతోంది. ఆదాయపు పన్ను కొత్త నియమాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. మార్పులు:కొత్త పన్ను విధానంలో టీడీఎస్‌ను ప్రభుత్వం తగ్గించింది. దీంతో చాలామంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుతుంది. పన్ను చెల్లించదగిన ఆదాయం రూ. 7 లక్షల కంటే తక్కువ ఉండి కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నవారు ఎటువంటి టీడీఎస్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 87ఏ కింద వారికి అదనపు మినహాయింపు ఉంటుంది. చెల్లింపులపై 10 శాతం టీడీఎస్ రూపంలో కోత ఉంటుంది.ఆన్లైన్ గేమ్‌ల ద్వారా డబ్బు గెలుచుకున్న వారు ఆదాయపు పన్ను చట్టంలోని కొత్త సెక్షన్ 115 BBJ ప్రకారం 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని టీడీఎస్ రూపంలో కట్ చేస్తారు.ఐటీ చట్టంలోని సెక్షన్ 54, 54ఎఫ్ కింద లభించే ప్రయోజనాలు కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి తగ్గుతాయి. రూ. 10 కోట్ల వరకు మూలధన లాభాలకు మాత్రమే ఈ సెక్షన్ల కింద మినహాయింపు ఉంటుంది. అంతకు మించిన మూలధన లాభాలపై 20 శాతం పన్ను విధిస్తారు.2023 ఏప్రిల్ 1 నుంచి ఆస్తి అమ్మకం ద్వారా వచ్చే లాభంపై అధిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
