సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను ఏప్రిల్ 3 నుం చి 18 వరకు నిర్వహించనున్నారు. మొత్తం 6లక్షల 60 వేల మంది విద్యా ర్థులు కు పరీక్షలను సజావుగా ముగించడంతోపాటు ఫలితాలను కూడా సాధ్య మైనం వేగంగా విడుదల చేసేందుకు విద్యా శాఖ కార్యా చరణ చేపట్టింది. ఈ నేపథ్యం లో ఏప్రిల్ 26 నాటికి మూల్యాంకనాన్ని ముగించి మే మొదటి వారానికల్లా ఫలితాలను విడుదల చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించినట్లు తెలుస్తుంది. పై ఉన్నత తరగతుల్లోకి వెళ్లేందుకు ఆలస్యం కాకుండా ఫలితాలను త్వరగా విడుదల చెయ్యనున్నారు. గతం లో 11 పేపర్లుగా ఈ పరీక్షలను నిర్వహించేవారు. కరోనా సమయం లో వీటిని ఏడింటికి తగ్గించారు. ఈ ఏడాది (2022–23) ఆరు పేపర్లలోనే పరీక్షలు నిర్వ హించనున్నా రు. అయితే సైన్స్ సబ్జెక్టులో పీఎస్, ఎన్ఎస్ పేపర్ ను రెండు భాగాలుగా విభజించి ఇస్తారు. రెండు బుక్లెట్లలో వీటికి సమాధానాలు రాయాలి. ముం దుగా భౌతిక, రసాయన శాస్త్రాల ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుం ది. అనం తరం జీవశాస్త్రం ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.
